150కి 150 మార్కులు సాధించిన ముగ్గురు అభ్యర్థులు | AP TET Results 2024 Top 3 Toppers List

ఏపీ టెట్‌ ఫలితాలు 2024: 150కి 150 మార్కులు సాధించిన ముగ్గురు అభ్యర్థులు – చరిత్ర సృష్టించిన ఘనత | AP TET Results 2024 Top 3 Toppers List

AP TET Result 2024: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) ఫలితాలు నవంబర్‌ 4న విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ అధికారికంగా విడుదల చేశారు, అలాగే ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈసారి టెట్‌ పరీక్షలో ముగ్గురు పేద కుటుంబాల అభ్యర్థులు చరిత్ర సృష్టించారు. 150కి 150 మార్కులతో 100 శాతం ఫలితాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.

150కి 150 మార్కులు సాధించిన అభ్యర్థులు

ఈ ముగ్గురు అభ్యర్థులు తమ ప్రతిభతో ముందుకు వచ్చి అద్భుత ఫలితాలు సాధించారు:

  1. కొండ్రు అశ్విని – విజయనగరం జిల్లా
  2. మంజుల – నంద్యాల జిల్లా, గొర్విమానుపల్లె గ్రామం
  3. క్రాంతికుమార్‌ – నిచ్చెనమెట్ల గ్రామం

వీరి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు, అయినా వారు ఈ అద్భుత ఫలితాలను సాధించడం ఎంతో ప్రత్యేకం.

AP TET Results 2024 Direct Link
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు | AP TET Results 2024 Direct Link
AP TET Results 2024 Top 3 Toppers List ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు | AP TET Results 2024 Direct Link

AP TET ఫలితాల్లో విజయ రేటు

ఈసారి టెట్‌ పరీక్షలో మొత్తం 1,87,256 మంది (50.79 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు, రాష్ట్రవ్యాప్తంగా రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, 3,68,661 మంది పరీక్ష రాశారు.

AP TET Results 2024 Top 3 Toppers List AP TET 2024 Results Mock Test Final Key Updates

టెట్‌ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ

డీఎస్సీ (DSC)లో టీచర్ పోస్టులకు ఎంపికలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. నవంబర్‌ 6న విడుదల కానున్న మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైటులో వివరాలను తనిఖీ చేసుకోగలరు - Click Here

తెలంగాణ టెట్ 2024: నోటిఫికేషన్ విడుదల

మరోవైపు తెలంగాణలో కూడా టెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్‌ 5న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 20 వరకు కొనసాగుతుంది. పరీక్ష జనవరి 1 నుంచి 20 వరకు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.

AP TET Results 2024 Top 3 Toppers List రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జిల్లాల వారీగా పోస్టుల వివరాలు

తెలంగాణ టెట్ అర్హతలు:

  • పేపర్ 1 – డీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు.
  • పేపర్ 2 – బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు.
AP TET Results 2024 Top 3 Toppers List ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024

తెలంగాణ టెట్ కోసం అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

Tags: AP TET Results 2024, AP DSC Notification 2024, Andhra Pradesh teacher recruitment 2024, AP TET exam results, AP TET 150 marks achievers, teacher eligibility test Andhra Pradesh, AP teacher exam cut-off marks, Telangana TET 2024 notification, high paying teaching jobs in AP, online application for AP DSC, DSC exam syllabus 2024, district-wise teacher vacancies in AP, AP TET passing criteria, AP DSC online exam process, best resources for AP TET

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.

WhatsApp Channel WhatsApp ఛానెల్ | Telegram Channel Telegram ఛానెల్