ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
అవ్వ తాతలకు కొత్త సంవత్సరం కానుక రెడీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం | New Year Gift For Pension Holders
అవ్వ తాతలకు న్యూ ఇయర్ కానుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవ్వ తాతల కోసం కొత్త సంవత్సరం కానుక రెడీ చేసింది. ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఈ వ్యాసాన్ని చివరి వరకు చదివి అన్ని వివరాలు తెలుసుకోండి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో అనేక ముందు చూపు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ కొత్త సంవత్సరం కానుక రెడీ చేసింది.
ఇక విషయానికొస్తే కూటమి ప్రభుత్వం ఈనెల కూడా అవ్వ తాతలకు, వితంతులకు, దివ్యాంగులకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక్కరోజు ముందుగానే అనగా డిసెంబర్ 31నే ఇస్తున్నారు. ఇప్పటికే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డిసెంబర్ 30న వారు బ్యాంకుల నుండి డబ్బులు కలెక్ట్ చేసుకుని 31వ తేదీన లబ్ధిదారులకు అందించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
నిజంగా ఇది లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త సంవత్సరం ముందుగా ఇస్తున్న ఈ పింఛను వారికి ప్రత్యేకంగా ఉపయోగపడవచ్చు. ఈ ఆలోచన చేసిన కూటమిప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు చెప్తున్నారు.
పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు అర్హతలు ఇవే
పంటలకు భీమా రైతుకు ధీమా ..మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం ఈనెలాఖరు వరకు ఛాన్స్…
Tags: New Year Gift For Pension Holders