AP Anganvadi Jobs Notification 2024 Anganwadi Jobs : అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు . ఈనెల 19 వరకు దరఖాస్తులను ఇవ్వవచ్చు. WDCW AP Anganwadi Recruitment 2024 : 10వ తరగతి ఉత్తీర్ణులై స్థానికంగా ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న మహిళలకు మంచి వార్త . తాజాగా ఏపీ చిత్తూరు జిల్లాలో అంగన్‌వాడీ నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రధానాంశాలు : ఏపీ అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2024
చిత్తూరు జిల్లాలో 87 ఖాళీల భర్తీకి ప్రకటన
జులై 19 దరఖాస్తులకు చివరితేది
Anganwadi Jobs 2024 : ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్ వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో ఐసీడీఎస్ పీడీ నాగశైలజ నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 87 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్య సమాచారం : మొత్తం అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య : 87 (అంగన్‌వాడీ వర్కర్-11, మినీ అంగన్‌వాడీ వర్కర్-18, అంగన్‌వాడీ హెల్పర్-58)అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళ అయి ఉండాలి.వయస్సు : దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థి వయసు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు నిండినవారు లేకపోతే, 18 ఏళ్ల నిండిన వారిని కూడా తీసుకుంటారు.దరఖాస్తులు ప్రారంభం తేదీ : జులై 4దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : జులై 19 (సాయంత్రం 5 గంటల లోపు ) దరఖాస్తు చేసుకోవాలి.గౌరవ వేతనం : అంగన్ వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7,000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7,000 ఉంటుంది.ఎంపిక విధానం : ఎలాంటి పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభా ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.AP Anganvadi Jobs Notification 2024AP Anganvadi Jobs Notification 2024 దరఖాస్తు విధానం : దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లోనే చేసుకోవాలి. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. అర్హత గల వారు దగ్గరిలోని సీడీపీఓ కార్యాలయంలోనే అప్లికేషన్ తీసుకొని, దాన్ని పూర్తి చేసి అన్ని రకాల ధ్రువపత్రాలను జత చేసి వారికి అందజేయాలి. అందజేయాల్సిన ధ్రువపత్రాల విషయానికొస్తే.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, నివాస స్థల ధ్రువీకరణ పత్రం, వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం, వికలాంగురాలైతే పీహెచ్ సర్టిఫికేట్, వితంతువు అయి పిల్లలు ఉన్నట్లు అయితే పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేసి అందజేయాల్సి ఉంటుంది. AP Anganvadi Jobs Notification 2024 More Links : PM viswakarma yojana Scheme : LINK
NTR Bharosa Pention Scheme : LINK
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.
WhatsApp ఛానెల్
|
Telegram ఛానెల్