2024-25 బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల సంక్షేమం కోసం కేటాయింపులు | Provisions for Welfare of SC, ST, BC and Minorities in Budget 2024-25 | AP Budget 2024 Welfare For SC ST BC and Minorities
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్న కూటమి ప్రభుత్వం సంకల్పాన్ని ప్రజలకు తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ బడ్జెట్ 2024-25
ఎస్టీ సంక్షేమం కోసం రూ.7,557 కోట్లు
గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంతో పాటు ఎస్టీల ఆర్థిక అభివృద్ధికి పునాది వేయాలన్న ఉద్దేశంతో రూ.7,557 కోట్లను కేటాయించింది. ముఖ్యంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, ఆర్.టి.ఎఫ్, ఎం.టి.ఎఫ్, విదేశీ విద్యానిధి పథకాల అమలుకు నిధులను కేటాయించడంతో పాటు, గిరిజనుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024-25 వ్యవసాయ బడ్జెట్
మైనారిటీల సంక్షేమం కోసం రూ.4,376 కోట్లు
ముస్లిం మైనారిటీల కోసం ఇప్పటికే మదర్సా నవీకరణ విద్యా పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఉర్దూ టీచర్ల నియామకం ద్వారా భాషాభివృద్ధికి కృషి చేస్తుంది. మైనారిటీల ఆర్థికాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించాయి. ఈ మేరకు మైనారిటీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు కేటాయించబడింది. ఇమామ్ లకు, మౌజంలకు, పాస్టర్లకు ప్రోత్సాహకాలు, మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్యా సాయం కూడా అందుబాటులో ఉంచారు.
ఎస్సీ సంక్షేమం కోసం రూ.18,497 కోట్లు
దళితాభ్యుదయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి భారీగా రూ.18,497 కోట్లను కేటాయించింది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన 27 పథకాలను పునరుద్ధరించడంతో పాటు, ఎస్సీల జీవనోపాధి కోసం రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల వరకు రాయితీతో కూడిన వడ్డీలేని రుణాలను అందించడానికి నిధులు కేటాయించారు. కాలేజీ సర్టిఫికెట్లు పొందడానికి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ సదుపాయాన్ని కాలేజీ యాజమాన్యాల ఖాతాలోకి నేరుగా జమ చేయడం, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను దశలవారీగా విడుదల చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.
వ్యవసాయం, గృహ నిర్మాణ మరియు నీటిపారుదల ప్రాజెక్టు లకు బడ్జెట్ కేటాయింపులు
బీసీల సంక్షేమం కోసం రూ.39,007 కోట్లు
టీడీపీ అంటే బీసీల పార్టీ అనే విధంగా రాష్ట్ర బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి అత్యధికంగా రూ.39,007 కోట్లను కేటాయించారు. రజకులు, దూదేకులు, నాయీ బ్రాహ్మణులు వంటి సంప్రదాయ వృత్తిదారుల జీవనోపాధి పెంపు కోసం ఆర్థిక సాయం అందించడంతో పాటు నేత కార్మికుల నైపుణ్యాభివృద్ధి శిక్షణకు నిధులను కేటాయించారు. బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి ఈ విధంగా పెద్దపీట వేయడం ద్వారా ఆ వర్గం సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీ వార్షిక బడ్జెట్ 2024 అద్భుతాలు విశేషాలు
తుది మాట
ఈ బడ్జెట్ ద్వారా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధిని నిర్ధారించడమే లక్ష్యంగా సాంకేతిక, సామాజిక మార్పులు తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం కేటాయించిన భారీ నిధులు వారి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకొస్తాయని ఆశిద్దాం.
Tags: SC welfare schemes in AP budget, ST development programs 2024, BC welfare allocation Andhra Pradesh, Minority welfare budget 2024, AP Budget SC financial assistance, AP ST welfare programs, BC education grants Andhra Pradesh, AP minority scholarships 2024, AP Budget economic development ST, AP BC welfare fund, Andhra Pradesh SC scholarships, financial aid for SC ST BC, AP minority welfare programs, education for SC ST BC minorities, budget for underprivileged communities Andhra Pradesh
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్స్బుక్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join Telegram Group