ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ – పూర్తి వివరాలు | New Pensions Applications From December Onwards
కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబరు మొదటి వారం నుండి అర్హులైన వారికి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించేందుకు అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని గురువారం సచివాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం
పెన్షన్ పంపిణీ సంబంధిత మార్గదర్శకాలు
పెన్షన్ పంపిణీ ప్రక్రియలో సమస్యలను తగ్గించేందుకు, మంత్రి శ్రీనివాస్ కొన్ని మార్గదర్శకాలను అధికారులకు సూచించారు:
- పెన్షనుదారులు గ్రామంలో ఒకటి, రెండు నెలల పాటు లేకపోయినా, తిరిగి వచ్చినప్పుడు పాత నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి అందించేలా చేయాలని ఆదేశించారు.
- వరుసగా మూడు నెలలు గ్రామంలో లేని పెన్షనుదారులను శాశ్వత వలసదారులుగా గుర్తించి, పెన్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రి సూచించారు. వారు తిరిగి దరఖాస్తు చేసుకున్న వెంటనే పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనర్హులపై పునఃసమీక్ష
పెంపుడు ఫిర్యాదులను పరిష్కరించేందుకు, అనారోగ్య కారణాల వల్ల మంచానికి పరిమితమైన వారు, వీల్చైర్‌కు పరిమితమైన దివ్యాంగులు పొందుతున్న పెన్షన్లలో అనర్హులు ఉన్నారని వచ్చిన ఫిర్యాదులపై మంత్రి పునఃసమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పునఃసమీక్ష ద్వారా నిజమైన అర్హత కలిగిన వారికి మాత్రమే పెన్షన్ అందించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వచ్చే నెల నుంచి 2లక్షల మందికి పింఛన్లు కట్
సమావేశంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు
ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సెర్ప్ సీఈవో వీరపాండ్యన్, వైద్య ఆరోగ్యశాఖ, గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
సారాంశం:
How to Apply for NTR Bharosa Pension 2024
డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుండగా, సర్కారు అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునే వీలును కల్పిస్తోంది.
Requier documents
న్యూస్ ఇచ్చారు ఓకే ఎలా అప్లై చేయాలి ఎక్కడ చేయాలి. పార్మెట్ (దరఖాస్తు)పెడితే బావుండును.