Thalliki Vandanam Scheme latest Update 2024
రాష్ట్ర ప్రభుత్వం నుండి తల్లికి వందనం పథకానికి కీలక అప్డేట్ వచ్చింద
ఉద్దేశం :
దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలను బడికి పంపించడమే ఈ పథకం ఉద్దేశం.అందరు చదుకోవాళ్ళన్నదే సారాంశం .
Thalliki Vandanam Scheme latest Update 2024
అర్హతలు :
దారిద్య్రయ రేఖ దిగువ (బిపిఎల్) ఉన్న కుటుంబాల పిల్లలకు
1 నుండి 12 వ తరగతి చదువుతున్న పిల్లలకు
75 శాతం స్కూల్లో హాజరు ఉండాలి
ఆధార్ కార్డు ఉండాలి
బ్యాంకు అకౌంట్ ఉండాలి
ఆధార్ కార్డు బ్యాంకు కి ఉండాలి
చదువుతున్న స్కూల్లో ఆధార్ కార్డుతో ఎన్రోల్ చేపించి ఉండాలి
ప్రయోజనాలు :
బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15000 రూపాయల డబ్బులు ప్రభుత్వం నుండి వస్తాయి
స్టూడెంట్ కిట్ పథకంలో విద్యార్థులకు బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం ఇస్తారు.Thalliki Vandanam Scheme latest Update 2024
రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధనను విధించింది.
బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తామని టిడిపి కూటమి సూపర్ సిక్స్‌లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే.
తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఆధార్ తప్పనిసరిగా ఉండాలని లేనిపక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకుని ఉండాలని వివరించింది.
ఆధార్ నంబరుతో పాటు బ్యాంకు, లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్, పాన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్డు, కిసాన్ ఫొటో పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహశీల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం, ఇతర శాఖలు ఇచ్చిన పత్రాలతో ఎన్‌రోల్ చేసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్‌కు కూడా ఆధార్ ఉండాలని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు, స్టూడెంట్ కిట్ పథకంలో విద్యార్థులకు బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం ఇస్తున్నట్లు తెలిపింది.సూళ్ళల్లో 75 శాతం హాజరు ఉన్నవారికే తల్లికి వందనం కింద 15000 రూపాయలు అమలు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం గా పేరు మార్చింది ఇప్పటి కూటమి గవర్నమెంట్. ఇప్పుడు దీని కోసమే విద్యార్థులు ఆధార్ నమోదు చేసుకోవాలని ఆదేశించింది.తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధ్రువీకరణ ద్వారా అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దారిద్య్రయ రేఖ దిగువ (బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు.1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద రూ.15 వేలు అందిస్తామని పేర్కొన్నారు. ఇది పొందాలంటే విద్యార్థి హాజరు 75 శాతం ఉండాలనే షరతు విధించారు.అదే విధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని, అందువల్ల ఆధార్‌ను ఎన్‌రోల్ చేసుకోవాలని పేర్కొన్నారు.
More Links :
Check Aadhra bank Account Link status : LINK
Anna canteen Reopen status : LINK
Tags : Thalliki Vandanam Scheme latest Update 2024 , thalliki vandanam scheme details in telugu, thalliki vandanam scheme eligibility,
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.